గుత్తిలోని వాసవి బజార్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆషాఢ మాస శుక్రవారం సందర్భంగా శాకంబరీ అలంకార ఉత్సవం ఘనంగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం జరిపారు. అనంతరం కూరగాయలు, ఆకుకూరలతో శాకంబరీ రూపంలో అమ్మవారని అలంకరించారు. లలిత సహస్రనామ, లక్ష్మీ పారాయణం, శాకంబరీ స్తోత్రం పఠించారు. భక్తులు భారీగా అమ్మవారిని దర్శించుకున్నారు.