ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ శుక్రవారం పేర్కొన్నారు. గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో 18వ వార్డులో నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొని టీడీపీ జెండా ఆవిష్కరించారు. పింఛన్ పెంపుతో పేద కుటుంబాల్లో వెలుగులు నెలకున్నాయన్నారు.