గుత్తి: నలుగురికి ఏడుగురు బోధన.. ఫలితం గుండు సున్నా

గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలోని ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అపకీర్తి మూటగట్టుకుంది. ఈ పాఠశాల నుంచి పరీక్షకు హాజరైన నలుగురు విద్యార్థులూ ఉత్తీర్ణత సాధించలేదు. గతేడాది యూపీ పాఠశాలగా ఉన్న దీనిని ఉన్నతీకరించారు. అదనంగా ఉపాధ్యాయులను కేటాయించినా, వారి బోధనా తీరు విద్యార్థుల ఫలితాల్లో ప్రతిఫలించలేదు. తెలుగు, సైన్స్, సాంఘిక శాస్త్రాల్లో విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. ఎంఈఓ రవినాయక్ మాట్లాడుతూ, విద్యార్థులంతా ఉత్తీర్ణులవుతారని ఆశించామని, ఫలితాలు అనుకున్నట్లు రాలేదని, ఉపాధ్యాయులంతా ప్రయత్నం చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్