గుత్తి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

గుత్తి మండలం రాజాపురం గ్రామ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఐచర్ వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు వివరించారు. ఈ ప్రమాదంలో సాయి పవన్, రాజు తీవ్రంగా గాయపడ్డారు. గుత్తి ఆర్ఎస్ కు చెందిన సాయి పవన్, రాజు బైక్ లో గుంతకల్లుకు బయలుదేరారు. మార్గ మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన ఇద్దరినీ గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనంతపురానికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్