గుత్తిలో భార్యను రాళ్లతో కొట్టి చంపిన భర్త

గుత్తి మండలం పూలకుంట కంకర మిషన్ వద్ద లక్ష్మి అనే మహిళను ఆమె భర్త శివలింగప్ప రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. గుంతకల్లు మండలం మైనాపురానికి చెందిన శివలింగప్ప తొలుత భార్యను కదిరిపల్లిలోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్