గుత్తి లో పింఛన్ తీసుకున్న అరగంటకే వ్యక్తి మృతి

గుత్తిలోని బీసీ కాలనీలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి శనివారం ఉదయం పింఛన్ తీసుకున్న అరగంటకే ప్రాణాలు విడిచారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మీయ చేతుల మీదుగా ఆయన పింఛన్ నగదు అందుకున్నారు. ఒకరోజు ముందుగానే పింఛన్ అందిన ఆనందంలో ఉన్న ఆ కుటుంబంలో, ప్రతాప్ రెడ్డి హఠాన్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్