గుత్తి లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గుమ్మనూరు

గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ. గుమ్మనూరు జయరాం గారు, తన కుమారుడు యువనేత శ్రీ. గుమ్మనూరు ఈశ్వర్ గారితో కలిసి గుత్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమం కోసం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్