సీసీ డ్రైనేజీ వ్యవస్థ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

పామిడి పట్టణం మూడవ వార్డులోని వెంగమ నాయుడు కాలనీ, చైతన్య కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, దీనిపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన తనయుడు శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ లను వార్డు ప్రజలు సంప్రదించారు. స్పందించిన ఎమ్మెల్యే, ఈశ్వర్ లు తక్షణమే 25 లక్షల రూపాయలతో నూతన సీసీ డ్రైనేజీలను ఏర్పాటు చేశారు. ఈరోజు వెంగమ నాయుడు కాలనీలో గుంతకల్లు శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం 25 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ డ్రైన్లను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్