ఓబుళాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి

ఓబుళాపురం గ్రామానికి చెందిన అన్నదమ్ములు వసకోట సర్వేశ్ (35), మంజు (32) ద్విచక్రవాహనంపై బళ్లారికి కూలీ పనులకు వెళ్తుండగా, అలకుంది వద్ద టిప్పర్ ఢీకొనడంతో సర్వేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన మంజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శనివారం బాధిత కుటుంబాలను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్