గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ సేవల ద్వారా స్వామివారి సులభతర దర్శనం కోసం టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో విజయరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, https://www.aptemples.org వెబ్సైట్ మరియు Whatsapp నంబర్ 9552300009 ద్వారా భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.