గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణంలో డబ్బిదార్ ఫిర్కా రుక్మిణి సమేత పాండురంగస్వామి ప్రతిష్ఠ మహోత్సవం అనంతరం, శుక్రవారం మండల అభిషేక పూజలు, హోమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. టీటీడీ వేద పండితులు కె.ఎస్.ఆర్. ఆర్య బృందం 81 కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీతి స్నపన తిరుమంజన అభిషేకం, విస్తృత పంచామృత అభిషేకాలు, మండల హోమాలు జరిపించారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు పాల్గొని, భక్తి ప్రపత్తులతో తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అన్నదానంలో పాల్గొన్నారు.