ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి. డి. ఎస్. యు) ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ నందు మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం నిర్వహించాలని ఈ సందర్భంగా నియోజకవర్గ ట్రెజరర్ బి. రోహిత్, నియోజకవర్గ నాయకులు సాయి, రాజు, సందీప్, తదితరులు కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సిన ఆవశ్యకతను వారు నొక్కి చెప్పారు.