ఎమ్మెల్యే స్టిక్కర్ తో రౌడీషీటర్ హల్చల్

అనంతపురం జిల్లా గుంతకల్ లో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్ ఉన్న వాహనంతో ఓ రౌడీషీటర్ హల్చల్ చేశాడు. అజయ్ అనే వ్యక్తి తన కారును అడ్డుగా పెట్టి బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. పెట్రోలింగ్ కానిస్టేబుల్ తప్పించుకోగా, పోలీసులు వెంబడించి అజయ్ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్