గుత్తి పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగవ తరగతి గది పైకప్పు పెచ్చులూడి పడటంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వెళ్లడంతో 17 మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. భోజనానికి వెళ్లకపోతే ప్రమాదం జరిగేదని హెచ్ఎం వీరాచారి తెలిపారు. అదృష్టవశాత్తూ అందరూ క్షేమంగా ఉన్నారు.