అనంతపురం జిల్లా ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కృషితో తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను గుంతకల్లు వరకు విస్తరించారు. మే 12వ తేదీన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఈ రైలు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ విస్తరణతో వైజాగ్ వెళ్లే అనంతపురం, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి ప్రాంతాల ప్రజలకు ప్రయాణం సులభతరం కానుంది.