గుత్తి రైల్వే జంక్షన్లోని రెండో ప్లాట్ఫామ్ నంబర్ వద్ద శుక్రవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగానే మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.