పామిడి మండలం పాళ్యం తండా వైసీపీ ఎంపీటీసీ నీలాబాయి(35) ఆకస్మికంగా మృతి చెందారు. నీలాబాయి, వెంకటేశ్ నాయక్ దంపతులు వజ్రకరూరులో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో నీలాబాయికి ఛాతీలో విపరీతంగా నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు నీలాబాయి అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.