కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను హరించే ప్రయత్నం చేస్తోందని సీఐటీయూ నాయకులు రామచంద్ర విమర్శించారు. ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం చిలమత్తూరు కోడూరులోని పరిశ్రమలకు సమ్మె నోటీసును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్ కుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.