ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి శనివారం హిందూపురం వైయస్సార్సీపి ఇంచార్జ్ దీపికా రెడ్డిని కలిశారు. పట్టణంలోని వైకాపా కార్యాలయంలో దీపికా రెడ్డితో పాటు వైకాపా నాయకులు, కార్యకర్తలతో కలిసి తన ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆహ్వానించారు. అనంతరం ఉమ్మడి జిల్లా రాజకీయాల గురించి దీపికా రెడ్డితో చర్చించారు.