హిందూపురంలో రూ.20 లక్షల రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో 19వ వార్డు పైపు లైన్ రోడ్డు వద్ద 92.50 కోట్ల రూపాయల నిధులతో 20 లక్షల రూపాయల వ్యయంతో కొత్త రోడ్డు నిర్మాణానికి భూమి పూజ జరిగింది. మునిసిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా, చాలా సంవత్సరాలుగా గుంతలమయంగా ఉన్న రోడ్ల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించి, త్వరలోనే కొత్త రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టి హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్