హిందూపురం మునిసిపల్ కార్యాలయం నందు ఒప్పంద కార్మికులుగా పనిచేస్తూ మరణించిన, రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పించే విషయంలో పారదర్శకంగా అందించామని మున్సిపల్ చైర్పర్సన్ డిఈ రమేష్ కుమార్, కమిషనర్ మల్లికార్జున గురువారం వెల్లడించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం నుంచి 17 మందికి నియామక ఉత్తర్వులు రాగా వాటిని కార్మికులకు అందించారు. కార్మికులు ఎమ్మెల్యే బాలకృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు.