రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వైయస్ జగన్ నెల్లూరు పర్యటన గురించి చేసిన వ్యాఖ్యలను హిందూపురం వైసీపీ ఇన్చార్జ్ దీపికా రెడ్డి ఖండించారు. నిన్న హోం మంత్రి మాట్లాడుతూ బంగారుపాళ్యం లో వచ్చిన జనాల వీడియోలను సాక్షిలో వేసి నెల్లూరులో జగన్ పర్యటనకు వచ్చారని అనడంపై దీపికా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హోం మంత్రి తాను చేసిన ఆరోపణలు నిరూపించాలని అన్నారు.