పార్లమెంటు ఆవరణలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం సైకిల్ తొక్కుతూ కాసేపు సందడి చేశారు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు రోజూ పార్లమెంట్‌కు వచ్చే సైకిల్ ను ఎమ్మెల్యే బాలకృష్ణకు చూపించారు. అనంతరం బాలకృష్ణ పార్టీ ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.