ఢిల్లీలో పార్లమెంట్ ను గురువారం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా బాలకృష్ణను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తో కలిసి పార్లమెంట్ ఆవరణంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాలకృష్ణ పార్లమెంట్ ప్రవేశద్వారం గేటు ప్రక్కన పార్కింగ్ లో ఉన్న ఎంపీ కలిశెట్టి సైకిల్ వద్దకు వెళ్లి ఎంపీతో మాట్లాడుతూ సైకిల్ ను చూసి అన్న ఎన్టీఆర్ అలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని అన్నారు.