తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో, హిందూపురం వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ దీపికా రెడ్డి ఇంటికి అర్ధరాత్రి పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్లారు. అయితే, దీపికా రెడ్డి భర్త వేణు రెడ్డి అర్ధరాత్రి వచ్చిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నోటీసులు తీసుకోబోనని తేల్చి చెప్పారు.