హిందూపురం మండలం చలివెందుల గ్రామంలో శుక్రవారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైకాపా నాయకుడు వేణు రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వైకాపా కార్యకర్తలు వేణు రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఇప్పుడు ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించారు.