హిందూపురం పట్టణానికి చెందిన వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్త దాదు తండ్రి సోమవారం అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం నియోజకవర్గ వైకాపా నాయకుడు వేణు రెడ్డి దాదు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వేణురెడ్డి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాం రెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు.