హిందూపురం: "రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించండి"

హిందూపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నందున రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ ఢిల్లీలోని పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరి, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ లను గురువారం కోరారు. ఈ సందర్బంగా హిందూపురం పార్లమెంట్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎస్ఆర్ నిధులను విడుదల చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్