హిందూపురం మున్సిపల్ పరిధిలోని ముద్దిరెడ్డిపల్లి దండు రోడ్డులో సీతారాముల దేవాలయ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ పాల్గొని భూమిపూజ నిర్వహించి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ హరీశ్ కుమార్, ఆలయ ధర్మ కర్త శ్రీరామప్ప, కోశాధికారి మారుతి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.