లేపాక్షి మండల పరిధిలోని పులమతి గ్రామంలోని తాళాలు వేసిన ఓ ఇంట్లో పెద్ద గొయ్యిని తవ్వారు. ఇంటి యజమాని చాలాకాలంగా బెంగళూరులో ఉండడంతో గుప్తనిధుల వేటగాళ్లు ఇంట్లోకి ప్రవేశించి భారీ గొయ్యను తవ్వి మట్టిని అదే ఇంట్లోనే పోశారు. గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి యజమాని అక్కడికి చేరుకొని ఇంట్లోకి వెళ్లి చూడగా భారీ గొయ్యి కనిపించడంతో అవాక్కయ్యారు.