బత్తలపల్లి మండల కేంద్రంలో ఎస్సీ జన సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు మద్దెలచెరువు మల్లి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న పాముల రమేష్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మద్దెలచెరువు మల్లి ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాకే కులయప్ప, మాల్యవంతం రాంప్రసాద్, ఓబులయ్య, కూరు ఓబులేసు, దాదితూరు తదితరులు పాల్గొన్నారు.