హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం అద్భుతంగా జరిగింది. సీతారాముల కళ్యాణం జరుగుతుండగా, ఒక రామచిలక అర్చకుని చేతిపై వాలింది. అనంతరం స్వామివారి విగ్రహం పక్కనే కూర్చుని కళ్యాణాన్ని తదేకంగా వీక్షించింది. ఈ సంఘటన భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.