హిందూపురంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేసిన పోలీసులు

హిందూపురం పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం, మహిళా దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జిల్లా అదనపు జడ్జ్ శైలజ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నూరు మందికి పైగా దాతలు రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, దీనివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం రక్తదాతలను ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్