హిందూపురం పట్టణంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనుందని ఏడిఈ నాగన్న తెలిపారు. పెద్దిరెడ్డిపల్లి 33 కె.వి. లైన్ మరమ్మతుల కారణంగా సూగూరు, ఇండోర్ 33/11 కె.వి. ఉపకేంద్రాల పరిధిలోని సడ్లపల్లి, ఆటోనగర్, టీచర్స్ కాలనీ, వాల్మీకి సర్కిల్, హస్నాబాద్, పరిగి రోడ్, మెయిన్ బజార్ తదితర ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందని శుక్రవారం వివరించారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.