సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకు ఇద్దరి అరెస్ట్

జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ మంగళవారం హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టిన ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ఐదుగురికి నోటీసులు జారీ చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ మహేశ్, సీఐలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్