శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కురుమామిడి గ్రామానికి చెందిన యల్లటూరి ఆంజనేయులు గ్రూప్–2 పరీక్షల్లో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. 2026 జనవరి 28న విడుదలైన ఫలితాల్లో ఈ విజయం సాధించారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివిన ఆంజనేయులు, 2021 నుంచి హైదరాబాద్‌లో గ్రూప్–2 పరీక్షలకు సిద్ధమయ్యారు. తన తల్లిదండ్రుల త్యాగాల వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు.