మా గ్రామ రోడ్డు సమస్యని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళండి..

శనివారం కదిరి జనసేన కార్యాలయంలో జౌకల గ్రామస్తులు, కదిరి నియోజకవర్గం జనసేన ఇన్చార్జి భైరవ ప్రసాద్ కి వినతిపత్రం అందించారు. నంబులపూలకుంట మండల కేంద్రం సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద నుండి జౌకల గ్రామం వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా మారిందని, కంకర లేచి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ సమస్యను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, తమ గ్రామానికి రోడ్డును బాగుచేయించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్