శ్రీసత్యసాయి జిల్లా, కదిరిలోని స్థానిక ఆర్ &బి బంగ్లాలో డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ 2026 డైరీ, వాల్ క్యాలెండర్, స్టిక్కర్ క్యాలెండర్‌ను ఎమ్మెల్యే గౌరవనీయులైన కందికుంట వెంకట ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి షర్ఫోద్దీన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టుబడి గౌస్, లాజమ్, మారుతి ప్రసాద్, నాయకులు మౌలాలి, రామకృష్ణ, నాగరాజు, షబ్బీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆవిష్కరణ జనవరి 1, 2026న జరిగింది.