గాండ్లపెంట: తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

గాండ్లపెంట మండలం కటారుపల్లి క్రాస్ లో గురువారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఇంటింటికీ తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్