కదిరి మండలం కాళసముద్ర గ్రామంలో మద్యం మత్తులో బుధవారం ముగ్గురు బాలురు అదే గ్రామానికి చెందిన ఎనిమిదో, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై దాడి చేశారు. వారు విడిపోవాలని ప్రయత్నించడంతో బూతులు తిట్టి కర్రలు, చెప్పులతో చితకబాదారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు.