ఆధ్యాత్మిక, సంఘసంస్కర్త, ప్రజా కవి వేమన జయంత్యుత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన వేమన రాష్ట్రస్థాయి జయంత్యుత్సవాల లోగోను ఆవిష్కరించారు. కటారుపల్లి వేమన సమాధి వద్ద జరిగే ఈ ఉత్సవాలు ప్రజల ఆలోచనా విధానంలో గొప్ప మార్పు తీసుకొస్తాయని, కదిరి చరిత్రలో గుర్తుండిపోయేలా పండుగలా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.