కదిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్, మహిళా రక్షణ విభాగం ప్రారంభోత్సవం కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా ఎస్పీ వి. రత్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సొంత నిధులు, జికెఎంఎన్ కన్సెన్షన్స్ గాలివీటి కృష్ణమోహన్ నాయుడు, ఈశ్యాన్ ఇన్ఫ్రాటెక్ ఆంజనేయులు దాతల సహాయంతో రూ 43లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్, మహిళా రక్షణ విభాగంను ప్రారంభించారు.