ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకోవాలని సత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న పేర్కొన్నారు. గురువారం కదిరి మండలం కాలసముద్రం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా సివిల్ రైట్స్ డే నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి సమాజంలో స్వేచ్ఛగా సమానత్వంతో జీవించే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని, అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు.