కదిరి: పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే...

కదిరి పట్టణంలోని 8వ వార్డులో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి సభ్యులు, జనసేన సమన్వయకర్త భైరవ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ తో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్