ఎన్ పి కుంట మండలంలో సోమవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పర్యటించారు. ధనియన్ చెరువు రైతు సేవ కేంద్రంలో రైతులకు వేరుశనగ పంపిణీ చేశారు. ధనియాన్ చెరువు గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించి, చిన్నారులకు బాలామృతం ప్యాకెట్లను అందించారు. గోవిందువారి పల్లి గ్రామంలో సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన ఆర్ఓ త్రాగునీటి ప్లాంట్‌ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు.