కదిరి టౌన్ అమీన్ నగర్, న్యూ అమీన్ నగర్ పరిధిలో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం నేతలు శనివారం డిమాండ్ చేశారు. సైదాపురం పొలంలోని ప్రభుత్వ భూమిలో సీపీఎం పార్టీ నిరసన చేసి జెండాలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో తహశీల్దార్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన పలు మార్లు నిర్వహించామన్నారు.