కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గం ఇంచార్జ్ మక్బూల్ ఆధ్వర్యంలో గురువారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు లింగాల లోకేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు.