శ్రీసత్యసాయి జిల్లా, కదిరిలోని బాలికల ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నేత్ర గణిత అవధానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణితం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, గణితం అంటే భయపడాల్సిన విషయం కాదని, ఆలోచించాల్సిన విషయమని ఉపాధ్యాయులు తెలిపారు. కంటి సైగలతో అంకెలు చెబితే వాటిని నోటితో చెప్పే విద్యార్థుల ప్రతిభను DEO జాన్ రెడ్డప్ప ప్రశంసించారు. కదిరి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వినూత్న కార్యక్రమం విద్యార్థులలో గణితం పట్ల ఆసక్తిని పెంచేలా ఉంది.