రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి UPDATE

కదిరి - పులివెందుల ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన డంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు రైతు రామకృష్ణ (58)గా గుర్తించారు. కదిరికుంట్లపల్లి పంచాయతీ పరిధి రామిరెడ్డి కాలనీకి చెందిన రామకృష్ణ వ్యక్తిగత పనిపై కదిరికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కదిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్