నంబుల పూలకుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ గ్రామ మహోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గురువారం తెలిపారు. ఈశా ఫౌండేషన్ సద్గురు వారి ఆధ్వర్యంలో 14, 15, 16 తేదీలలో మూడు రోజుల పాటు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తిమ్మమ్మరి మాను క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు శ్రీసత్యసాయి, కదిరి ప్రాంతాలలో వైభవంగా జరగనున్నాయి.